సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి పూర్తి

ABN , First Publish Date - 2020-07-19T08:12:27+05:30 IST

సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి ఆలయ పనులు గడువులోగా పూర్తవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి అన్నారు.

సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి పూర్తి

సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌ రెడ్డి


యాదాద్రి, జూలై 18(ఆన్‌లైన్‌): సమన్వయంతో పని చేస్తేనే యాదాద్రి ఆలయ పనులు గడువులోగా పూర్తవుతాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి అన్ని విభాగాల పనులను ఏక కాలంలో కొనసాగించాలని సూచించారు. పనులు సెప్టెంబరు నాటికి పూర్తి కావల్సిందేనన్నారు. 

Updated Date - 2020-07-19T08:12:27+05:30 IST