‘వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’
ABN , First Publish Date - 2020-10-19T22:32:31+05:30 IST
‘వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి’

హైదరాబాద్: అధిక వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పీసీసీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు. వరి, ఇతర పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులకు మర్మతులు చేయాలన్నారు.