జయశంకర్‌కు గండికొట్టేందుకే..

ABN , First Publish Date - 2020-06-25T08:06:40+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌కు పద్మభూషణ్‌ అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశ్యంతోనే పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ

జయశంకర్‌కు గండికొట్టేందుకే..

పీవీకీ భారతరత్న అంటూనాటకం:బీసీ సంఘంరాంనగర్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌కు పద్మభూషణ్‌ అవార్డు  ఇవ్వాలనే డిమాండ్‌ను నిర్వీర్యం చేయాలనే దురుద్దేశ్యంతోనే పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ కపట నాటకానికి సీఎం కేసీఆర్‌ తెరతీశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. కరోనాను నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన సీఎం.. జనం దృష్టి మరల్చడానికేపీవీ జయంత్యోత్సవాలంటూ నిర్వహించాలని సీఎం ప్రకటించారని ధ్వజమెత్తారు. పీవీ, కేసీఆర్‌లు తెలంగాణ నినాద భోక్తలని ఆరోపించారు. ఆచార్య జయశంకర్‌, కొండా లక్ష్మణ్‌బాపూజీ, పండిత్‌ నారాయణరెడ్డి వంటి వారు తెలంగాణ త్యాగధనులని కొనియాడారు. అగ్రవర్ణ దురహంకారానికి సీఎం కేసీఆర్‌ నిదర్శనమని దుయ్యబట్టారు. బీసీలను అణగదొక్కుతున్నారని సత్యనారాయణ ఆరోపించారు. 

Updated Date - 2020-06-25T08:06:40+05:30 IST