జూరాలకు నిలకడగా ప్రవాహం

ABN , First Publish Date - 2020-10-03T09:55:14+05:30 IST

జూరాలకు నిలకడగా ప్రవాహం

జూరాలకు నిలకడగా ప్రవాహం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కొద్దిరోజులుగా పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జలాశయానికి శుక్రవారం లక్షా 11 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదు కాగా 12 గేట్ల ద్వారా 78,612 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. జూరాల జల విద్యుత్తు కేంద్రంలో 33,464 క్యూసెక్కులతో 22 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టులో 8.8 టీఎంసీల నీరు ఉంది. జూరాల నుంచి మొత్తం 1,13,983 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,61,586 క్యూసెక్కుల నీరు వస్తోంది. 5 గేట్లను ఎత్తి, కుడి గట్టు జలవిద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి చేస్తూ 1,64,677 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.


శ్రీశైలం నీటి మట్టం 884.30 అడుగులు(211.4 టీఎంసీలు)గా ఉంది. నాగార్జున సాగర్‌ 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు(312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 589.20అడుగులు(309.6 టీఎంసీలు)గా ఉంది. సాగర్‌ నుంచి మొత్తం 1,64,677 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 175(45.77టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 174.27(44.64టీఎంసీలు) అడుగుల మేర నీరు ఉంది. ప్రాజెక్టుకు 1,28,559 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 6 గేట్ల ద్వారా 1,57,077క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

Updated Date - 2020-10-03T09:55:14+05:30 IST