గాంధీలో సమ్మెకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

ABN , First Publish Date - 2020-06-25T11:56:36+05:30 IST

గాంధీలో సమ్మెకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

గాంధీలో సమ్మెకు సిద్ధమవుతున్న జూనియర్ డాక్టర్లు

హైదరాబాద్/అడ్డగుట్ట(ఆంధ్రజ్యోతి): తమ డిమాండ్ల పరిష్కారానికి మంత్రి ఈటల ఇచ్చిన హామీ నెరవేరక పోతుండడంతో జూనియర్‌ వైద్యులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి ఘటనతో తమకు రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ధర్నా చేసిన జూడాలు.. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హామీతో తిరిగి విధుల్లో చేరారు. అయితే.. పది రోజులవుతున్నా సమస్యల పరిష్కారం దిశగా ఎలాంటి చలనం లేకపోవడంతో జూడాలు ఆలోచనలో పడ్డారు. ఈ సారి సమ్మె ఉధృతంగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ దిశగా ఆస్పత్రిలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఇతర ఔట్‌సోర్సింగ్‌ విభాగాల సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు.  

Updated Date - 2020-06-25T11:56:36+05:30 IST