కోటి మొక్కలతో హరితహారం: అర్వింద్‌కుమార్
ABN , First Publish Date - 2020-05-24T09:16:30+05:30 IST
జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ ఏడాది తెలంగాణ హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలను ...

హైదరాబాద్ సిటీ, మే23 (ఆంధ్రజ్యోతి): జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ ఏడాది తెలంగాణ హరితహారం కార్యక్రమానికి కోటి మొక్కలను సిద్ధం చేయాలని మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. తెల్లాపూర్‌లోని 150 ఎకరాల విస్తీర్ణంలో గల హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ నర్సరీని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ వివిధ రకాల మొక్కలు, వాటి ఎదుగుదల తీరుతెన్నులను తెలుసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఖాళీ స్థలాలతో పాటు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో పచ్చదనం పెంచేందుకు అనుగుణంగా కోటి మొక్కలకు పైగా సిద్ధం చేస్తున్నట్లు ఫారెస్ట్రీ అధికారులు ఆయనకు వివరించారు. అర్వింద్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల నుంచి వచ్చే ప్లాంటేషన్ ఆర్డర్లకు అనుగుణంగా మొక్కలను అందజేసేట్లు హెచ్‌ఎండీఏ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈసారి హెచ్‌ఎండీఏ పరిధిలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని 500 పార్కులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను అర్బన్ ఫారెస్ట్రీ విభాగానికి అప్పగించారు.