జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బండా ప్రకాశ్
ABN , First Publish Date - 2020-12-28T04:21:58+05:30 IST
జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బండా ప్రకాశ్

న్యూశాయంపేట, డిసెంబరు27 : తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హన్మకొండలోని అల్లూరి కళాశాలలో జూడో అసోసియేషన్ కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రొఫెసర్ కందగట్ల సుధాకర్, అరుణ్ ద్విదేది, అజిజ్‌ఖాన్, అశోక్ కుమార్ ఎన్నికను పర్యవేక్షించారు. రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ బండా ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌కు చెందిన గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, ట్రెజరర్‌గా పి.బాలరాజు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు మొత్తం కలిపి 26 మంది సభ్యుల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బండా ప్రకాష్ మాట్లాడుతూ జూడోలో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపేందుకు కృషి చేస్తానన్నారు.