వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2020-02-12T11:10:56+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేష్‌

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట

జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణిరాకేష్‌

కాటారంలో వ్యవసాయ శాఖ క్యాలెండర్ల ఆవిష్కరణ


కాటారం, ఫిబ్రవరి 11: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేష్‌ అన్నారు. కాటారం మండలకేంద్రంలో మంగళవారం వ్యవసాయ శాఖ క్యాలెం డర్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుం దని తెలిపారు. వేలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందన్నారు. వ్యవసాయ శాఖకు బడ్జెట్‌లో అధిక నిధుల కేటాయింపు జరుగు తుందన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. రైతుబీమా పథకం ద్వారా అకాల మృతి చెందిన రైతులకు పరి హారం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి రామకృష్ణ, సర్పంచ్‌లు తోట రాధమ్మ, నిట్టూరి శేఖర్‌, ఎంపీటీసీ తోట జనార్ధన్‌, ఉపసర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డోలి అర్జయ్య, యూత్‌ మండల అధ్యక్షుడు నరివెద్ది శ్రీనివాస్‌, మహిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య, ఏఎంసీ డైరెక్టర్లు సడువలి, సిరాజ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-12T11:10:56+05:30 IST