జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కీలక పత్రాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-09T01:28:14+05:30 IST

అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై దాడి చేసిన విద్యాశాఖ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో కీలక పత్రాలు స్వాధీనం

హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై దాడి చేసిన విద్యాశాఖ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్కూల్ రికార్డులేవీ పారదర్శకంగా లేవని నిర్ధారించారు. అసలేం జరిగిందంటే.. జూబ్లీహిల్స్ స్కూల్‌లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ స్కూల్‌పై దాడి చేశారు. అయితే స్కూల్ యాజమాన్యం అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో అధికారులు పోలీసుల సాయంతో స్కూల్‌లో సోదాలు నిర్వహించారు. స్కూల్ నుంచి కొన్ని కీలక డాక్యూమెంట్లను తీసుకువెళ్లారు. వాటిని పరిశీలించిన అధికారులు రికార్డులేవీ పారదర్శకంగా లేవని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో మరికొన్ని డాక్యూమెంట్లు సమర్పించాలని స్కూల్ యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించారు.

Updated Date - 2020-07-09T01:28:14+05:30 IST