‘సింగరేణి’ మాస్‌కాపీయింగ్‌ స్కామ్‌లో అందరిపై చర్యలు తీసుకోవాలి సీపీఐ డిమాండ్‌

ABN , First Publish Date - 2020-12-26T08:38:58+05:30 IST

సింగరేణి కాలరీ్‌సలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానిక్‌ విభాగంలో ఉద్యోగాల భర్తీకి జరిగిన పోటీ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ స్కామ్‌కు పాల్పడిన అందరిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

‘సింగరేణి’ మాస్‌కాపీయింగ్‌ స్కామ్‌లో అందరిపై చర్యలు తీసుకోవాలి సీపీఐ డిమాండ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీ్‌సలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానిక్‌ విభాగంలో ఉద్యోగాల భర్తీకి జరిగిన పోటీ పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ స్కామ్‌కు పాల్పడిన అందరిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సింగరేణి రిక్రూట్‌మెంట్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ కోలా హరీష్‌, లక్ష్మీ నారాయణలు హరియాణ, బిహార్‌ గ్యాంగ్‌లతో కుమ్మక్కై అర్హత పరీక్షలో హైటెక్‌ పద్ధతిలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ స్కాంలో దాదాపు 32 మంది ఉండగా, 12 మందినే   అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మిగిలిన 20 మంది పరారీలో ఉన్నప్పటికీ పరీక్ష ఫలితాలు విడుదల చేయడానికి  పోలీసులు అనుమతి ఇచ్చారన్నారు. పరీక్షలు మళ్లీ నిర్వహించాలని  సింగరేణి మేనేజ్‌మెంట్‌ బోర్డును డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-26T08:38:58+05:30 IST