రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వండి

ABN , First Publish Date - 2020-06-06T09:02:29+05:30 IST

రైతులు, రేషన్‌ లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటే బాధ్యత గల పౌరుడిగా ఆయన చిత్రపటానికి ..

రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వండి

కేసీఆర్‌ ఫొటోకు క్షీరాభిషేకం చేస్తా: జీవన్‌రెడ్డి


జగిత్యాల, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రైతులు, రేషన్‌ లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటే బాధ్యత గల పౌరుడిగా ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తానని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్‌ షాపుల ద్వారా ఇప్పుడు ఇస్తున్న దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం అందించాలని, సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2500 చొప్పున చెల్లించాలని సూచించారు. అలా చేస్తే సంతోషపడే వారిలో తాను ముందుంటానని అన్నారు. కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకుంటే టీఆర్‌ఎస్‌ నాయకులే క్షీరాభిషేకం చేయాలని లేదని, తాను కూడా చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-06-06T09:02:29+05:30 IST