హరీష్‌రావును బలిపశువు చేశారు: జితేందర్ రెడ్డి

ABN , First Publish Date - 2020-11-13T19:54:49+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లలో గెలవబోతోందని ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి అన్నారు.

హరీష్‌రావును బలిపశువు చేశారు: జితేందర్ రెడ్డి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లలో గెలవబోతోందని ఆ పార్టీ నేత జితేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఓడిపోతామని తెలిసే మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ బలిపశువును చేశారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా  ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బీజేపీలోకి టీఆర్ఎస్ సహా పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్న ఆయన విజయశాంతి ఎప్పుడు పార్టీలో చేరుతుందో తన వద్ద సమాచారం లేదన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్‌ను కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.  


సీఎం కేసీఆర్ నియంత పాలన, ఒంటెద్దు పోకడను తిప్పికొట్టాలని ప్రజల్లో కక్ష మొదలైందని, ఆ కక్షను ప్రజలు దుబ్బాక ఎన్నికలో తీర్చుకున్నారన్నారని జితేందర్ రెడ్డి అన్నారు. ఒక్క దుబ్బాకలోనే 84వేల మంది ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకత చూపించారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 80 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎంను కూడా వంద శాతం టార్గెట్ చేస్తామని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-13T19:54:49+05:30 IST