జిన్నింగ్‌ మిల్లులో ఘోరం

ABN , First Publish Date - 2020-12-11T04:43:32+05:30 IST

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందిన ఘటన అమీన్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. కార్మికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫిరూజ్‌బాద్‌ జిల్లా బాదాం మండలానికి చెందిన బోలేసింగ్‌(24) భవానీ కాటన్‌ ఇండస్ర్టీయల్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు.

జిన్నింగ్‌ మిల్లులో ఘోరం
మృతి చెందిన యువకుడు బోలేసింగ్‌

జిన్నింగ్‌ మిల్లులో ఘోరం

అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి 

చెన్నారావుపేట, డిసెంబరు 10: అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి చెందిన ఘటన అమీన్‌పేటలో గురువారం చోటు చేసుకుంది. కార్మికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫిరూజ్‌బాద్‌ జిల్లా బాదాం మండలానికి చెందిన బోలేసింగ్‌(24) భవానీ కాటన్‌ ఇండస్ర్టీయల్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. ఉదయం విధుల్లోకి వచ్చి మధ్యాహ్న పత్తి బెల్ల మధ్యలో పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై శీలం రవి ఘటనా స్థలాన్ని పరిశీలించి, కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-11T04:43:32+05:30 IST