రాజకీయాల్లోకి జయారెడ్డి!
ABN , First Publish Date - 2020-05-29T09:04:36+05:30 IST
ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో తండ్రితోపాటు ఆమె పాల్గొనడం దీన్నే సూచిస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ,

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో తండ్రితోపాటు ఆమె పాల్గొనడం దీన్నే సూచిస్తోంది. వాస్తవానికి గత అసెంబ్లీ, మునిసిపల్ ఎన్నికల్లో ఆమె క్రియాశీలకంగా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగ్గారెడ్డి అరెస్టు కాగా, జయారెడ్డే స్వయంగా ప్రచారంలో పాల్గొని ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. మునిసిపల్ ఎన్నిక లప్పుడూ సదాశివరావుపేట ఇన్‌చార్జిగా వ్యవహరించి తండ్రి తరఫున కొన్ని హామీలూ ఇచ్చారు. ఈ క్రమంలోనే మరింత క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. జయారెడ్డి పట్ల సానుకూలంగా ఉన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర కార్యవర్గంలో ఆమెకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది.