జయశంకర్‌ కృషిని తెలంగాణ మరవదు

ABN , First Publish Date - 2020-06-22T09:16:17+05:30 IST

‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషి అమోఘం. ఆయన విశేష కృషిని తెలంగాణ ఎన్నటికీ ..

జయశంకర్‌ కృషిని తెలంగాణ మరవదు

ఆయన సేవలు గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ చేసిన కృషి అమోఘం. ఆయన విశేష కృషిని తెలంగాణ ఎన్నటికీ మరవదు’’ అని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆదివారం జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా యావజ్జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్‌ అని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ‘‘నీ స్ఫూర్తిని మా గుండెల నిండా పదిలంగా ఉంచుకున్నాం. జయహో జయశంకర్‌ సార్‌. పిడికిలెత్తి పలుకుతోంది తెలంగాణ జోహార్‌’’ అని మంత్రి హరీశ్‌ ట్వీట్‌ చేశారు. మిస్‌ యూ సార్‌.. అని కవిత ట్వీట్‌ చేశారు.


మరో పోరాటానికి సిద్ధమవ్వాలి: కోదండ 

రాష్ట్ర ప్రజల బతుకు కోసం ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. జయశంకర్‌ మిత్రుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ ఉపాధి లభించిన రోజే జయశంకర్‌ ఆశించిన తెలంగాణ సాధ్యమైనట్టు అవుతుందని పేర్కొన్నారు.  


 నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌

కల్నల్‌ సంతో్‌షబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం సూర్యాపేటకు రానున్నారు. సంతో్‌షబాబు కుటుంబసభ్యులను పరామర్శించడంతోపాటు రూ.5 కోట్ల నగదు, షేక్‌పేట్‌లో ఇంటి స్థలం, సంతో్‌షబాబు భార్య సంతోషికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను సీఎం స్వయంగా అందించనున్నారు.


పాలకులను ప్రశ్నించాలి: మాడభూషి

ప్రజాస్వామ్యం బతకాలంటే పాలకులను నిగ్గదీసి ప్రశ్నించాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్‌ మాజీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య అధ్యక్షతనజరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Updated Date - 2020-06-22T09:16:17+05:30 IST