ఢిల్లీ నుంచి వచ్చినవారు సహకరించాలి: నిరంజన్
ABN , First Publish Date - 2020-04-05T08:31:22+05:30 IST
ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని కరోనా బారినపడ్డ వారిపట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరముందని టీపీసీసీ...

హైదరాబాద్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన సమావేశంలో పాల్గొని కరోనా బారినపడ్డ వారిపట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరముందని టీపీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ అన్నారు. కరోనా బారినపడ్డవారు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి, డాక్టర్లకు సహకరించాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న వికలాంగులు, ఇతర లబ్ధిదారులకు వెంటనే పింఛన్‌ను విడుదల చేయాలని కోరుతూ టీపీసీసీ వికలాంగుల సెల్ చైర్మన్ ఎం. వీరయ్య సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.