బీసీల్లో ఓటు చైతన్యం కోసం సదస్సులు: జాజుల

ABN , First Publish Date - 2020-10-03T09:49:31+05:30 IST

వచ్చే నెల దుబ్బాక ఉప ఎన్నిక మొదలు తదుపరి గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం..

బీసీల్లో ఓటు చైతన్యం కోసం సదస్సులు: జాజుల

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): వచ్చే నెల దుబ్బాక ఉప ఎన్నిక మొదలు తదుపరి గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం.. అనంతరం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో బీసీల్లో ఓటు చైతన్యం కోసం మేథోమథన సదస్సులను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఇవి ఈ నెల 4న నల్లగొండలో ప్రారంభమై నవంబరు 4న నిజామాబాద్‌లో ముగుస్తాయన్నారు.

Updated Date - 2020-10-03T09:49:31+05:30 IST