బీజేపీకి డెడ్‌లైన్లు పెడతాం: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-12-19T18:36:28+05:30 IST

బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీకి డెడ్‌లైన్లు పెడతాం: జగ్గారెడ్డి

సంగారెడ్డి: బండి సంజయ్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. యువతను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి.. బీజేపీ అధికారంలోకి వచ్చిందని మాట తప్పారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధానిని సంజయ్‌ ప్రశ్నిస్తారా అని సవాల్ విసిరారు.  ధరల పెరుగుదలపై సంజయ్ సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు.  సంజయ్‌కి దమ్ముంటే గ్యాస్, పెట్రోల్‌ ధరలు తగ్గించాలని ప్రధానిపై కొట్లాడాలి, లేకుంటే బీజేపీకి మేం డెడ్‌లైన్లు పెడతామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read more