ధరణిపై అనేక అనుమానాలు ఉన్నాయి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-12-17T22:12:40+05:30 IST
ధరణిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం ధరణిపై ఉన్న అనుమానాలను ..

హైదరాబాద్: ధరణిపై అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం ధరణిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆస్తుల వివరాలు ఎందుకివ్వాలని ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పెళ్లిళ్లు చేయాలంటే ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కోర్టును సాకుగా చూపి రిజిస్ట్రేషన్లు ఎన్ని రోజులు అవుతారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.