ఎల్ఆర్ఎస్‌పై నిర్ణయం మార్చుకోవాలి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-12-27T22:10:54+05:30 IST
ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎల్ఆర్ఎస్‌కు డబ్బులు కట్టలేరన్నారు.

హైదరాబాద్: ఎల్ఆర్ఎస్‌పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎల్ఆర్ఎస్‌కు డబ్బులు కట్టలేరన్నారు. ప్రజలకు ఎల్ఆర్ఎస్ భారం కాకుండా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. రూ. 10 వేల నామమాత్రపు రుసుముతో ఇళ్లు, ప్లాట్లు రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి కోరారు.