వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2020-10-01T20:18:36+05:30 IST
రైతులకు మేలు చేస్తామని కేంద్రం ప్రభుత్వం భ్రమలు కల్పించిందని..
సంగారెడ్డి: రైతులకు మేలు చేస్తామని కేంద్రం ప్రభుత్వం భ్రమలు కల్పించిందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు మాట్లాడకుండా మోదీ సర్కారు గొంతునొక్కిందని ఆరోపించారు. వ్యవసాయ బిల్లుకు నిరసనగా శుక్రవారం సంగారెడ్డిలో రైతు దీక్ష చేస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు.