నేను విజిలేస్తే 10వేల మంది వస్తారు..చూస్తారా?
ABN , First Publish Date - 2020-03-13T09:13:54+05:30 IST
నేనూ విజిల్ వేస్తే పది వేల మంది వస్తారు. చూస్తారా? జగ్గారెడ్డి పవర్? రేవంత్‌రెడ్డి అనుచరులు, పార్టీ అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో పెట్టే వారికి ఇదే నా

రేవంత్ అనుచరులపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘నేనూ విజిల్ వేస్తే పది వేల మంది వస్తారు. చూస్తారా? జగ్గారెడ్డి పవర్? రేవంత్‌రెడ్డి అనుచరులు, పార్టీ అంతర్గత విషయాలను సోషల్ మీడియాలో పెట్టే వారికి ఇదే నా హెచ్చరిక’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ కాంగ్రె్‌సలో అంతర్గత కలహాలు సహజమేనని, తమలో తాము ఎన్ని అనుకున్నా కలిసే ఉంటామన్నారు. ‘‘పీసీసీ చీఫ్ కావాలని ఏ నేతకు ఉండదు? మాకు సోషల్ మీడియాతో సంబంధం లేదు. మేము ప్రజలతో కలిసి పనిచేస్తాము. మాకు ఎవరో పైసలు ఇస్తే.. ఎవరో పంపిస్తే లీడర్లం కాలేదు. మేము కారెక్కాలనుకుంటే మమ్మల్ని ఎవరూ ఆపలేరు. సోషల్ మీడియాలో రేవంత్ అనుచరులు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారు’’ అని అన్నారు. తాను జీవో 111పై మాత్రమే మాట్లాడానని, కేటీఆర్‌తో పంచాయితీ రేవంత్ వ్యక్తిగతమన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ సొంతం కాదని, ఆయన వల్ల పార్టీ ఇబ్బందులు పడాలా?అని ప్రశ్నించారు. తాము రేవంత్‌కు బాసటగా ఉంటే.. ఆయన అనుచరులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.