జగన్‌ ప్రవర్తన అభినందనీయం: సౌందరరాజన్‌

ABN , First Publish Date - 2020-09-25T09:35:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తన ఎంతో అభినందనీయమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌వీ సౌందరరాజన్‌ అన్నారు...

జగన్‌ ప్రవర్తన అభినందనీయం: సౌందరరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 24: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రవర్తన ఎంతో అభినందనీయమని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌వీ సౌందరరాజన్‌ అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌తో కలిసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్‌రెడ్డి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తీరు బాగుందన్నారు.  రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న చిలుకూరు బాలాజీ ఆలయ కమిటీకి వైసీపీ ఎంపీలు పార్లమెంటులో మద్దతు ప్రకటించాలని కోరారు. 

Updated Date - 2020-09-25T09:35:34+05:30 IST