అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోంది: కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-06-23T00:19:59+05:30 IST
సీఎం జగన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు పోలీసు రాజ్యం ఏలుతోందని

హైదరాబాద్: సీఎం జగన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్పుడు పోలీసు రాజ్యం ఏలుతోందని, ప్రజాస్వామ్య వ్యవస్థతో ఇది మంచిది కాదని సూచించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన...ఆరేళ్ల ప్రధాని మోదీ పాలనను బేరీజు వేయాలని, మోదీ విదేశీ, ఆర్థిక, అభివృద్ధి విధానాలపై చర్చకు సిద్దమని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.