జగన్, గాలి జనార్దన్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై కేసుల విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-11-04T03:59:54+05:30 IST
పలువురు ప్రజా ప్రతినిధుల కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆస్తులు, ఓఎంసీ అక్రమాలు, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులతో ....
హైదరాబాద్: పలువురు ప్రజా ప్రతినిధుల కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. జగన్ ఆస్తులు, ఓఎంసీ అక్రమాలు, గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులతో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసులు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులను కూడా ధర్మాసనం విచారించింది.
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ కేసుల విచారణ బుధవారానికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల చార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలన్న జగన్ డిశ్చార్జి పిటిషన్‌పై వాదనలు జరిగాయి.
ఓఎంసీ అక్రమాల కేసు విచారణ 5కి వాయిదా పడింది. ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ బుధవారానికి వాయిదా వేశారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న పలు కేసుల్లో విచారణ కొనసాగింది.
2012 పరకాలలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసుకు సంబంధించిన విచారణ కూడా జరిగింది. ఈ నెల 10న వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, కొండా సురేఖ, కొండా మురళీ కూడా కోర్టుకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు ఊరట లభించింది. ఆయనపై నమోదైన రెండు కేసులతో పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించిన కేసును కూడా కోర్టు కొట్టివేసింది.