ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని జ్యోతి వెలిగించండి: మంత్రి జగదీశ్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-04-05T21:45:15+05:30 IST
ఈ రోజు రాత్రి ఒకేసారి లైట్లు ఆపితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఏబీఎన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఈ రోజు రాత్రి ఒకేసారి లైట్లు ఆపితే వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఏబీఎన్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రతి రోజు విద్యుత్ వినియోగంలో 2, 3 వేల మెగావాట్లు తేడా వచ్చినా ఎదుర్కొంటున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. లైట్లు ఆపివేయడం వల్ల చాలా తక్కువ తేడా ఉంటుందని, 700 మెగావాట్ల లోపే తేడా వస్తుందని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకుని జ్యోతి వెలిగించే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. లైట్లు ఆపివేసినప్పుడు వచ్చే తేడా విద్యుత్‌ను ఇతర చోట్ల వాడకానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.