కామారెడ్డి సీఐ జగదీష్ అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-21T16:09:36+05:30 IST
హైదరాబాద్: కామారెడ్డి సీఐ జగదీష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో

హైదరాబాద్: కామారెడ్డి సీఐ జగదీష్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో జగదీష్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. సీఐ ఇంటితో పాటు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ జగదీష్‌తో పాటు సహకరించిన సృజయ్ కూడా అరెస్ట్ అయ్యాడు.