ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2020-03-12T17:09:39+05:30 IST

జడ్చర్ల నేషనల్‌ హైవేపై లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఏకంగా హైవేపై పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జడ్చర్ల నేషనల్ హైవేపై ..

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌: జడ్చర్ల నేషనల్‌ హైవేపై లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఏకంగా హైవేపై పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జడ్చర్ల నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-03-12T17:09:39+05:30 IST