సెర్ప్‌లో ముఖాముఖి భేటీలు వద్దు: జేఏసీ
ABN , First Publish Date - 2020-07-19T08:31:21+05:30 IST
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ముఖాముఖి సమావేశాలను నిర్వహించవద్దని సెర్ప్ ఉద్యోగ...

హైదరాబాద్, జూలై 18(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో ముఖాముఖి సమావేశాలను నిర్వహించవద్దని సెర్ప్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈవోకు శనివారం వినతిపత్రం పంపారు. వీడియో/సెల్ కాన్ఫరెన్స్‌ల ద్వారా సమావేశాలు నిర్వహించేలా ఆదేశించాలని, సెర్ప్ ఉద్యోగులందరికీ ఇంటి నుంచే పనిచేసే అవకాశమివ్వాలని వారు కోరారు.