ఐటీఐలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి
ABN , First Publish Date - 2020-12-12T03:53:02+05:30 IST
ఐటీఐలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోండి
కాకతీయకాలనీ, డిసెంబరు 11 : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2020-21 విద్యా సంవత్సరంలో నాలుగో విడత అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకోవాలని ్లు వరంగల్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.జుమ్లానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు www.iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్‌ను చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇంతకుముందు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ పెట్టుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రాధాన్యతాక్రమంలో అభ్యర్థులు ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని జుమ్లానా యక్ తెలిపారు.