యాక్సెస్‌ ఎనర్జీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2020-12-11T08:35:36+05:30 IST

యాక్సెస్‌ ఎనర్జీ గ్రూపు కార్యాలయాల్లో గురువారం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ

యాక్సెస్‌ ఎనర్జీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

యాక్సెస్‌ ఎనర్జీ గ్రూపు కార్యాలయాల్లో గురువారం ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో కంపెనీకి సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి.

తెలంగాణలోని హైదరాబాద్‌లో కార్యాలయం ఉంది. రెండు రాష్ట్రాల్లోని 20 చోట్ల అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను చెల్లింపు తాలూకు పత్రాలు, రిటర్నులను పరిశీలించారు.


Updated Date - 2020-12-11T08:35:36+05:30 IST