మరో రెండు రోజులూ వర్షాలే
ABN , First Publish Date - 2020-08-11T08:56:20+05:30 IST
మరో రెండు రోజులూ వర్షాలే

రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా 2.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 13న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.