హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-04T19:40:53+05:30 IST

మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం రేగింది. బిల్డింగ్‌-20లోని డీఎస్‌ఎం కంపెనీ ఉద్యోగి పరిమిళకు...

హైదరాబాద్‌లోని మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం

హైదరాబాద్‌: మైండ్‌స్పేస్‌లో కరోనా కలకలం రేగింది. బిల్డింగ్‌-20లోని డీఎస్‌ఎం కంపెనీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌‌గా తెలిసింది. ఆమె విదేశాలకు వెళ్లి వచ్చినట్టు సమాచారం. కరోనా పాజిటివ్‌ కేసుతో ఉద్యోగులను డీఎస్‌ఎం కంపెనీ ఇంటికి పంపింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి. ఉదయం లండన్‌ నుంచి శంషాబాద్‌ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. స్క్రీనింగ్‌లో కరోనా లక్షణాలు తేలడంతో అతనిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-03-04T19:40:53+05:30 IST