అనంతగిరిలో ఐసొలేషన్‌ ఎత్తేయాలి

ABN , First Publish Date - 2020-03-16T09:10:13+05:30 IST

వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఎత్తేయాలని అఖిల పక్షం నేతలు డిమాండ్‌ చేశారు.

అనంతగిరిలో ఐసొలేషన్‌ ఎత్తేయాలి

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌... నేడు వికారాబాద్‌ బంద్‌

వికారాబాద్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఎత్తేయాలని అఖిల పక్షం నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం వికారాబాద్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఐసొలేషన్‌ కేంద్రం వల్ల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారని.. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అనంతగిరికి పర్యాటకులు, భక్తులు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.


అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివర్ణిస్తూ పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం కేసీఆర్‌.. తన హామీని విస్మరించి ఉన్న ఖ్యాతిని పోగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనంతగిరికి బదులుగా పటాన్‌చెరులోని తన మెడికల్‌ కళాశాలలో ఐసొలేషన్‌ ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. అఖిలపక్షం సమావేశంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్‌, చంద్రశేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T09:10:13+05:30 IST