పాజిటివ్‌లకు హోటల్ గదుల్లో ఐసోలేషన్
ABN , First Publish Date - 2020-07-18T08:01:57+05:30 IST
ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనాతో బాధపడే వారికి పడకలు దొరకడం గగనమైపోయింది. రోజూ భారీ సంఖ్యలో కరోనా బాధితులు వస్తుండటంతో పడకలు కేటాయించలేక ఆస్పత్రులు ప్రత్యామ్నాయ మార్గాలు అవలంభిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు హోటళ్ల నిర్వాహకులతో

హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనాతో బాధపడే వారికి పడకలు దొరకడం గగనమైపోయింది. రోజూ భారీ సంఖ్యలో కరోనా బాధితులు వస్తుండటంతో పడకలు కేటాయించలేక ఆస్పత్రులు ప్రత్యామ్నాయ మార్గాలు అవలంభిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు హోటళ్ల నిర్వాహకులతో ఒప్పందాలు కుదుర్చుకొని అక్కడే హోం ఐసోలేషన్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇప్పటికే అపోలో ఆస్పత్రి మూడు హోటళ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా అస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కూడా ప్రీమియం హోటల్-క్వారంటైన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సీఈవో దేవానంద్ తెలిపారు. ఈ ప్యాకేజీలో రోజుకు రెండు సార్లు నిపుణులైన నర్సింగ్ సిబ్బంది టెలిఫోన్ ద్వారా పాజిటివ్‌ల బీపీ, జ్వరం వంటి సమస్యలను తెలుసుకుంటారన్నారు. రెండు సార్లు వీడియో, లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా వైద్యులతో సంప్రందింపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేకంగా సేవలు అందిస్తామన్నారు. బాధితులు స్వయంగా బీపీ, జ్వరం, ఆక్సిజన్ స్థాయి తెలుసుకునేందుకు ప్రత్యేక కిట్‌ను అందజేస్తామన్నారు.