కాచిగూడ స్టేషన్‌లో ఐసోలేషన్ కోచ్‌లు
ABN , First Publish Date - 2020-04-08T10:23:28+05:30 IST
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల్లో ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్‌లో కేవలం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులు...

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మూడు రోజుల్లో ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్‌లో కేవలం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మాత్రమే వీటిని అందుబాటులో ఉంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 40 ఐసోలేషన్ కోచ్‌లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే 19 బోగీలను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చారు. మిగతా బోగీల్లో పనులు చురుకుగా సాగుతున్నాయి. ఒక్కో కోచ్‌లో 13 మంది కరోనా అనుమానితులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. మొత్తం 500 మందికి చికిత్స అందించే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. - బర్కత్‌పుర