పాలిటెక్నిక్‌ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

ABN , First Publish Date - 2020-02-12T11:01:11+05:30 IST

పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు(ఐఎ్‌సఓ) లభించింది. ఐఎ్‌సఓ 9001-2015 ధ్రువీకరణకు సంబంధించి

పాలిటెక్నిక్‌ కళాశాలకు ఐఎస్‌ఓ  గుర్తింపు

పరకాల, ఫిబ్రవరి11: పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు(ఐఎ్‌సఓ) లభించింది. ఐఎ్‌సఓ 9001-2015 ధ్రువీకరణకు సంబంధించి ఆధునిక సాంకేతిక విద్యను అందించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు గుర్తింపు లభించింది. సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచినందుకు గాను సాంకేతిక విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ మిటల్‌ చేతుల మీదుగా హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌లో  సోమవారం కళాశాల ప్రిన్సిపాల్‌ బండి శ్రీనివాస్‌ ప్రమా ణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఐఎ్‌సఓ దృవీకరణ లభించ డం పట్ల కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-02-12T11:01:11+05:30 IST