‘స్టాఫ్‌నర్స్’ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు
ABN , First Publish Date - 2020-11-13T09:04:28+05:30 IST
స్టాఫ్‌నర్స్ పోస్టుల సర్వీస్ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు జరిగాయని, దాదాపు 300 మందికిపైగా అభ్యర్థులకు అర్హతలేకున్నా దొడ్డిదారిన వెద్య
300 మందికిపైగా దొడ్డిదారిన మార్కులు
టీఎస్‌పీఎస్సీకి పలువురి ఫిర్యాదు
ధ్రువపత్రాల పరిశీలన వాయిదా
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): స్టాఫ్‌నర్స్ పోస్టుల సర్వీస్ వెయిటేజీ మార్కుల్లో అక్రమాలు జరిగాయని, దాదాపు 300 మందికిపైగా అభ్యర్థులకు అర్హతలేకున్నా దొడ్డిదారిన వెద్య ఆరోగ్యశాఖ అధికారులు మార్కులిచ్చారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ అక్రమాలపై పలువురు అభ్యర్థులతోపాటు నర్సింగ్ ఔట్‌సోర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు టీఎ్‌సపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్యశాఖ పంపిన మార్కుల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఇప్పటికే ప్రకటించిన మెరిట్ జాబితాను ఉపసంహరించాలని కోరారు. ఆ తర్వాతే అర్హుల కొత్త జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మెరిట్‌జాబితా మారే అవకాశం: టీఎ్‌సపీఎస్సీ
వెయిటేజీ మార్కులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన టీఎ్‌సపీఎస్సీ.. వాటిని వైద్య ఆరోగ్యశాఖకు పంపించింది. మెరిట్ జాబితా మారే అవకాశముందని టీఎ్‌సపీఎస్సీ గురువారం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 19వరకు ఆన్‌లైన్‌లో కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలనను వాయిదావేస్తున్నట్లు తెలిపింది. వైద్యఆరోగ్య శాఖ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత సవరించిన మెరిట్‌జాబితాను ప్రకటిస్తామని వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలన కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామంది.