శనగ కొనుగోళ్ల అక్రమాలపై అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-03-19T10:39:49+05:30 IST

నిర్మల్‌ జిల్లా ముథోల్‌లోని పీఏసీఎస్‌ బీద్రెల్లి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శనగ కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై నిర్మల్‌

శనగ కొనుగోళ్ల అక్రమాలపై  అదనపు కలెక్టర్‌ ఆగ్రహం

ముథోల్‌, మార్చి 18 : నిర్మల్‌ జిల్లా ముథోల్‌లోని పీఏసీఎస్‌ బీద్రెల్లి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శనగ కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలపై నిర్మల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంలోని శనగ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇదివరకు కొనుగోలు చేసిన శనగ బస్తాలను మళ్లీ తూకం వేయించి చూడగా.. తేడాలు రావడంతో పీఏసీఎస్‌ సిబ్బందిపై మండిపడ్డారు. రైతులు  పండించిన పంటను కచ్చితమైన తూకం వేయాల్సింది పోయి.. ఒక్కో బస్తాకు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు రైతుల నుంచి ఎందుకు అదనంగా తూకం వేస్తున్నారని ప్రశ్నించారు. ఇకపై రైతులకు నష్టం కలిగిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. 

Updated Date - 2020-03-19T10:39:49+05:30 IST