అంతర్గత భద్రతలో ఐపీఎ్‌సలే కెప్టెన్‌లు: గవర్నర్‌

ABN , First Publish Date - 2020-08-18T07:49:27+05:30 IST

దేశ అంతర్గత భద్రతలో ఐపీఎ్‌సలు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారని రాష్ట్ర గవర్నర్‌ తమిళి

అంతర్గత భద్రతలో ఐపీఎ్‌సలే కెప్టెన్‌లు: గవర్నర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): దేశ అంతర్గత భద్రతలో ఐపీఎ్‌సలు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ప్రొబేషనరీ ఐపీఎ్‌సలతో గవర్నర్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల రూపు మారుతోందని, సైబర్‌ ప్రపంచంలో నేరాలు అధికమవుతున్నాయన్నారు. పోలీసులు టెక్నాలజీ సాయంతో సైబర్‌ నేరాలను అరికట్టాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఐపీఎ్‌సలు, పోలీసులు ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేశారని, వారి స్పూర్తితో అంకిత భావంతో పనిచేయాలన్నారు. 

Updated Date - 2020-08-18T07:49:27+05:30 IST