విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి..

ABN , First Publish Date - 2020-09-03T09:49:47+05:30 IST

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి వెళ్లాడు.

విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి..

  • సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న దేవ్‌జీ

జగిత్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ విద్యార్థి దశలోనే ఉద్యమంలోకి వెళ్లాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి 1983లో ఇంటర్‌ చదువుతుండగానే ఉద్యమ బాట పట్టాడు. ఆ ఏడాది కోరుట్లలో ఓ ఏబీవీపీ కార్యకర్త హత్యతో తిరుపతికి సంబంధం ఉందని పోలీసులు కేసు పెట్టడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తిరుపతి ప్రస్తుతం దండకారణ్యంలో ఉంటున్నాడు. అలిపిరి వద్ద చంద్రబాబు కారు పేల్చిన ఘటనకు తిరుపతి వ్యూహ రచన చేశాడని అప్పట్లో పోలీసులు ప్రకటించడం సంచలనం రేకెత్తించింది.  గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా వైదొలగే సమయంలో తిరుపతికి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. కానీ నంబాల కేశవరావుకు బాధ్యతలు అప్పగించారు.  

Updated Date - 2020-09-03T09:49:47+05:30 IST