నట్టింట్లో... ‘నెట్’ఇంట్లో!
ABN , First Publish Date - 2020-03-23T06:43:15+05:30 IST
జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇండియాలో ఇంటర్‌నెట్ వినియోగం మూడింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ ఐటీ సంస్థ అధ్యయనంలో ...

ఆదివారం మూడింతలు పెరిగిన నెట్ వినియోగం
హైదరాబాద్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇండియాలో ఇంటర్‌నెట్ వినియోగం మూడింతలు పెరిగిందని ఓ అంతర్జాతీయ ఐటీ సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా సెకనుకు సగటున 65-70 వేల జీబీ డేటా వినియోగిస్తుండగా అది ఆదివారం రికార్డు స్థాయిలో 89,268 జీబీలుగా నమోదైందని తెలిపింది. ప్రపంచం మొత్తం ఇంటర్‌నెట్ వినియోగంలో భారత్ వాటా 9 శాతంగా ఉంది. ఆదివారం ఇది 23 శాతానికి చేరిందని ఆ సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం ఆదివారం అత్యధికులు యూట్యూబ్‌ను వీక్షించారు.