ఫెయిలయ్యానని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-06-22T09:00:59+05:30 IST

ఇంటర్‌ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఫెయిలయ్యానని ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఫెయిలయ్యానని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

చిల్‌పచెడ్‌, జూన్‌ 21: ఇంటర్‌ మొదటి సంవత్సరంలో రెండు సబ్జెక్టులు ఫెయిలయ్యానని ఓ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్‌ జిల్లా చిల్‌పచెడ్‌ మండలం భద్ర్యాతండాకు చెందిన చందూ లాల్‌(17) సంగారెడ్డిలోని ఓ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండు సబ్జెక్టులు తప్పడంతో మనస్తాపం చెందిన చందూలాల్‌ సంగారెడ్డిలోని తనబంధువుల ఇంట్లో శనివారం ఉరేసుకుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - 2020-06-22T09:00:59+05:30 IST