ఇంటర్ ఫలితాల విడుదల... బాలికలదే హవా
ABN , First Publish Date - 2020-06-18T20:56:08+05:30 IST
రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు.
హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 4 లక్షల 80 వేల 516 మంది హాజరు కాగా...60.01 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలబడింది. ఇక రెండో స్థానంలో 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.
ఫస్టియర్ ఫలితాల లింక్
సెకెండియర్ ఫలితాల లింక్
ఇక సెకండియర్‌లో 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు హాజరు కాగా... 68.86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం తొలి స్థానంలో నిలబడింది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ రెండో స్థానం దక్కించుకుంది. మొత్తం 25 వేల మంది ఇన్విస్‌లేటర్లు హాజరు కాగా... 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని మంత్రి ప్రకటించారు.