ఇంటర్‌ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్ధుల హవా

ABN , First Publish Date - 2020-06-19T01:08:25+05:30 IST

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రంలోని జ్యోతిబాపూలే బిసి గురుకుల కళవాల విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ ద్వితీయ

ఇంటర్‌ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్ధుల హవా

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రంలోని జ్యోతిబాపూలే బిసి గురుకుల కళవాల విద్యార్ధులు ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 91.77 ఉత్తీర్ణత, ఇంటీర్మీడియట్‌మొదటి సంవత్సరంపరీక్షల్లో 87.29 శాతం ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్‌ కాలేజీలకుధీటుగా తమ సత్తా చాటారు. ఇంటర్‌ సెకండ్‌ఇయర్‌ పరీక్షల్లో ఎంపిసి గ్రూపులో అత్యధికంగా 1000 మార్కులకు గాను 989 మార్కులతో వనపర్తిజిల్లా చిట్యాలకు చెందిన పి.గణేష్‌ ఉత్తీర్ణత సాధించాడు. అలాగే బైపిసి గ్రూపులో అత్యధికంగా 1000 మార్కులకుగాను రంగారెడ్డిజిల్లా మహేశ్వరంకు చెందిన జి.రవితేజ 983 మార్కులు సాధించాడు.


అలాగే ఎంఈసీ గ్రూపులో 1000 మార్కులకుగాను నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన పి.రాణా ప్రతాప్‌ 973 మార్కులు సాధించాడు.ఇక సీఈసీ గ్రూపులో అత్యదికంగా 1000 మార్కులకుగాను నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన కె.భాస్కరాచారి 974 మార్కులు సాధించాడు. ఇక ఇంటర్‌మొదటి సంవత్సరం పరీక్షల్లో ఎంపిసి గ్రూపులో సిద్దిపేటకు చెందిన ఎన్‌.సాయిశ్రియ, 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించగా, బైపిసిలో అదేజిల్లాకు చెందిన వై. సౌజన్యం 440 మార్కులకు గాను 431 మార్కులు సాధించింది.


ఎంఈసీ గ్రూపులో అదే జిల్లాకు చెందిన ఎన్‌.మానస 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించింది. సీఈసీ గ్రూపులో నల్గొండ జిల్లాకు చెందిన కె. రవితేజ 500 మార్కుకు  ఆను 487 మార్కులు, హెచ్‌ఈసీ గ్రూపులో కరీంనగర్‌జిల్లాకు చెందిన ఎం. శ్రీజ జిల్లా మొదటి ర్యాంకు సాధించింది. వీరిని బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, బిసి సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బిసి గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. 

Updated Date - 2020-06-19T01:08:25+05:30 IST