ఆరుగురు విద్యార్థులు ఆలస్యం...అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2020-03-04T15:52:38+05:30 IST

ఆరుగురు విద్యార్థులు ఆలస్యం...అనుమతి నిరాకరణ

ఆరుగురు విద్యార్థులు ఆలస్యం...అనుమతి నిరాకరణ

రామన్నపేట: పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనను అధికారులు తూ.చా తప్పకుండా పాటిస్తున్నారు. యాదాద్రి రామన్నపేట ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలో వివిధ కాలేజీలకు చెందిన ఆరుగురు విద్యార్థులు పరీక్షాకేంద్రానికి ఆలస్యంగా వచ్చారు. దీంతో వారిని హాల్‌లోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. విద్యార్థుల్లో ఐదుగురు రామన్నపేట ప్రభుత్వ కాలేజీకి చెందిన వారు కాగా, ఒకరు నలంద కాలేజీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు. పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడంతో విద్యార్థులు విలపిస్తూ ఇంటికి తిరుగుముఖం పట్టారు. 

Updated Date - 2020-03-04T15:52:38+05:30 IST