రాష్ట్రస్థాయి ‘ఇన్‌స్పైర్’కు జనగామ జిల్లా విద్యార్థులు
ABN , First Publish Date - 2020-12-20T04:00:14+05:30 IST
రాష్ట్రస్థాయి ‘ఇన్‌స్పైర్’కు జనగామ జిల్లా విద్యార్థులు

జనగామ కల్చరల్, డిసెంబరు 19: ‘ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనక్’ రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఐదు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. జిల్లా నుంచి మొత్తం 46 మంది పాల్గొనగా 5 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఇ.రవళి, 9వతరగతి (వాణి హైస్కూల్, బచ్చన్నపేట), ఎ.నందిని, 8వ తరగతి (గీతాంజలి పబ్లిక్ స్కూల్, జనగామ), బి.రాకేశ్, 9వ తరగతి (జడ్పీహెచ్‌ఎ్‌స, కడవెండి), ఎస్.శిరీష, 10వ తరగతి (సెయింట్ మేరీస్ స్కూల్, రఘునాథపల్లి), టి.ఫెలిస్ థెరిసా, 9వ తరగతి (సెయింట్ మేరీస్ హైస్కూల్, జనగామ) రూపొందించిన ప్రాజెక్టులను త్వరలో రాష్ట్రస్థాయిలో ప్రదర్శిస్తారని డీఈవో ఎస్.యాదయ్య తెలిపారు.