ధరణి పోర్టల్‌పై విచారణ నేటికి వాయిదా
ABN , First Publish Date - 2020-11-25T08:02:31+05:30 IST
ధరణి పోర్టల్‌లో వ్యవసాయేత ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం వరకూ పొడిగించింది.

హైదరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌లో వ్యవసాయేత ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం వరకూ పొడిగించింది. ధరణిలో ఆస్తుల వివరాల నమోదు కోసం ఆధార్ సంఖ్య, కులం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ న్యాయవాది కాశీభట్ల సాకేత్, గోపాల్ శర్మ ప్రజాహిత వాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది.