కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-06-26T20:45:58+05:30 IST

చొప్పదండిలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

కాంగ్రెస్ నేతల వినూత్న నిరసన

కరీంనగర్ జిల్లా: చొప్పదండిలో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. చెవిలో పూలు పెట్టుకుని వరద కాలువ దగ్గర ఆందోళన చేపట్టారు. కాలువల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యేకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతాంగం సమస్యలపై లేదని విమర్శించారు. ఏడాదిలోగా రైతులకు నీళ్లిస్తామని చెప్పిన ఎమ్మెల్యే రవిశంకర్ మాట తప్పారని, శంకుస్థాపన చేసిన చెక్ డ్యామ్‌ల పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ఆయన ప్రశ్రించారు.

Updated Date - 2020-06-26T20:45:58+05:30 IST