సామూహిక కార్యక్రమాలపై నియంత్రణ: ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-08-20T16:33:30+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామూహిక కార్యక్రమాలపై నియంత్రణ విధిస్తున్నట్లు

సామూహిక కార్యక్రమాలపై నియంత్రణ: ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామూహిక కార్యక్రమాలపై నియంత్రణ విధిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సామూహిక ఉత్సవాలకు అనుమతి ఇవ్వొద్దని కేంద్రం మార్గదర్శకాలు సూచించిందన్నారు. ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, బోనాలు, బక్రీద్ తదితర పండుగలు ..ఎవరిళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. పంద్రాగస్టు, రాష్ట్ర అవతరణ వేడుకలు చాలా నిరాడంబరంగా జరిగాయన్నారు. అలాగే వినాయక చవితి ఉత్సవాలు, మొహర్రం కూడా.. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇళ్లలోనే వినాయకుడికి పూజలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-08-20T16:33:30+05:30 IST